పవన్‌ కళ్యాణ్‌ ఈ బర్త్ డే బుధవారం సోషల్‌ మీడియాలో సందడిగా సాగింది. హ్యాపీబర్త్ డే పవన్‌ కళ్యాణ్‌ యాష్‌ ట్యాగ్‌లు ట్రెండ్‌ అయ్యాయి. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని ఏకంగా నాలుగు సినిమాల అప్‌డేట్‌లు వచ్చాయి. అభిమానులను ఖుషీ చేశాయి. 

పవన్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని అనేక మంది ఆయనకు బర్త్ డే విశెష్‌ తెలిపారు. అయితే ప్రధానంగా కొంత మంది ప్రముఖులకు రీప్లై ఇవ్వడం కామన్‌. కానీ పవన్‌ చిన్న స్థాయి నటుల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి రీప్లై ఇచ్చారు. కార్తీకేయ, ప్రదీప్‌, సంపూర్నేష్‌బాబు, సత్యదేవ్‌ ఇలా చాలా మందికి రీప్లై ఇచ్చారు. వారితో తనకు ఉన్న అనుబంధాన్ని గానీ, వారి సినిమాలను గానీ, వారికి సంబంధించిన ఏదైనా ఒక గుర్తు చేస్తూ మరీ రీ ట్వీట్‌ చేయడంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బివవుతున్నారు. 

అందులో తమిళ హీరో శివకార్తికేయన్‌ చెప్పిన బర్త్ డే విశెష్‌కి పవన్‌ స్పందన హైలైట్‌గా నిలిచింది. `డియర్‌ తిరు శివ కార్తికేయన్‌. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీరు మీ జీవితంలో ఎన్నో సాధించాలని కోరుకుంటున్నా. మీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. మీ సినిమాలోని `ఉదా కలర్‌ రిబ్బన్‌` పాట నాకెంతో ఇష్టం. లెక్కలేనన్ని సార్లు చూశాను` అని పవన్‌ ట్వీట్‌ చేశాడు. 

దీంతో శివ కార్తికేయన్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. `మీ రీప్లైకి ధన్యవాదాలు సార్‌. నా `ఉదా కలర్‌ రిబ్బన్‌..` పాట మీకు నచ్చడంతో నాకెంతో గొప్పగా అనిపిస్తోంది. మీ సమయాన్నివెచ్చించి నాపై ప్రేమను చూపించేలా ట్వీట్‌ చేసినందుకు ధన్యవాదాలు` శివ కార్తికేయన్‌ చెప్పారు. సో.. మొత్తంగా పవన్‌ ప్రతి చిన్న వ్యక్తికి కూడా స్పందించిన తీరు పట్ల సినీ వర్గాలే కాదు, ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పవన్‌లోని ఈ మార్పుకి షాక్‌ అవుతున్నారు. అదే సమయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ పట్ల తమకి మరింత అభిమానం పెరిగిందన్నారు.