కార్తీ జోడీగా పూజా హెగ్డే..? క్రేజీ న్యూస్ లో నిజమెంత..?
ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్లు సందడి చేస్తున్నాయి..మరికొన్ని చేయబోతున్నాయి. ఈక్రమంలో తమిళ స్టార్ హీరో కార్తీ జోడీగా.. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జతకట్టబోతోందట...?

పాపం పూజా హెగ్డే.... వరుస ప్లాప్ లతో సతమతంఅవుతుంది. ఇటు టాలీవుడ్ లో... కోలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో కూడా ఆమెకు హిట్ సినిమాలు లేవు. అయితే విచిత్రం ఏంటంటే.. ఇన్ని ప్లాప్ లు పడుతున్నా.. ఐరన్ లెగ్ అని పేరు వచ్చినా.. ఆమెకి ఉన్న క్రేజ్ గానీ .. మార్కెట్ గాని తగ్గలేదు. వరుస ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ లు అందులోను పాన్ ఇండియా స్థాయి ఫ్లాపులు పడినప్పటికీ.. పూజా కూడా ఎక్కడా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడింది. అంతే కాదు వచ్చిన అవకాశాలు వదిలేయకుండా తనకి నచ్చినవాటికి సైన్ చేస్తూ ముందుకు వెళుతోంది.
ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా. ఈసినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నం చేస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉండగా.. ఇక ఇటు టాలీవుడ్ నుంచే కాకుండా అటు తమిళం నుంచి కూడా ఆమెకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. అందులో ఇంపార్టెంట్ వాటిని చూస్ చేసుకుంటుంది బ్యూటీ. తాజాగా ఆమె కోలీవుడ్ లో ఒక భారీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పూజా తమిళంలో చేయబోయే ఆ భారీ ప్రాజెక్ట్ లో హీరోగా కార్తీ నటించబోతున్నట్టు తెలుస్తోంది. కార్తీతో పూజా నటించడం ఇది తొలిసారి. గతంలో కార్తి హీరోగా వచ్చిన ఆవారా తమిళంతో పాటు తెలుగులోను హిట్ టాక్ తెచ్చుకుంది. 2010లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి లింగుస్వామి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఆయన పూజ హెగ్డేను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈసినిమా విషయంలలో హీరో కార్తీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. పూజా దాదాపు ఒకే చెప్పినట్టే అని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే.. పూజా హెగ్డే విజయ్ తో చేసిన బీస్ట్ తరువాత తమిళంలో చేసే ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. అంతే