తమిళ నటి రియమిక్క(26) బుధవారం నాడు వలసరవక్కం ప్రాంతంలో తను అద్దెకు ఉంటోన్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ చేసుకున్న వద్ద తమకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. 

తమిళ చిత్రాలు కుంద్రతిలే కుమారనుకు కొండట్టం, అఘోరి యిన్ అట్టం ఆరంభం వంటి సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన రియమిక్క తన సోదరుడు ప్రకాష్ తో కలిసి వలసరవక్కం ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో జీవిస్తోంది. గత నాలుగు నెలలుగా రియమిక్క తన సోదరుడితోనే కలిసి ఉంటోంది.

మంగళవారం ఉదయం నుండి రియమిక్కకి ఎన్ని సార్లు ఫోన్ చేస్తున్నా ఆమె తీయలేదట. బుధవారం కూడా అలానే చేయడంతో ప్రకాష్ వెంటనే రియమిక్క బాయ్ ఫ్రెండ్ తో దినేష్ తో కలిసి ఇంటికి చేరుకోగా.. లోపల నుండి తాళం వేసి ఉండడంతో తన దగ్గర ఉన్న తాళంచెవితో తలుపులు తెరచి చూడగా అప్పటికే రియమిక్క ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు రియమిక్క నివాసానికి చేరుకొని ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి విచారణ మొదలుపెట్టారు.