Asianet News TeluguAsianet News Telugu

నిన్న 'కరోనా' దెబ్బ, ఈ రోజు కాపీ అంటూ కేసు

కరోనా దెబ్బతో దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఈ లోగా ఈ సినిమాకు కాపీ సమస్య మొదలైంది.  చిత్రం కథ తనదంటూ యువ దర్శకుడు బోస్కో ప్రభు కోర్టులో కేసు వేస్తే దాని తీర్పు వచ్చింది. 

Tamil Dubbing Sakthi movie in copy story issue
Author
Hyderabad, First Published Mar 21, 2020, 4:13 PM IST

శివకార్తికేయన్‌ హీరోగా గతేడాది విడుదలైన ‘హీరో’ చిత్రాన్ని ఈ నెల 20న తెలుగులో శక్తి పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విడుద‌ల చేస్తామ‌ని తెలుగు నిర్మాత‌లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా దెబ్బతో దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఈ లోగా ఈ సినిమాకు కాపీ సమస్య మొదలైంది.  చిత్రం కథ తనదంటూ యువ దర్శకుడు బోస్కో ప్రభు కోర్టులో కేసు వేస్తే దాని తీర్పు వచ్చింది. ఈ నేపధ్యంలో తన చిత్రం రిలీజ్ ఆపాలని ఆ కేసు వేసిన బోస్కో తెలిపారు. దాంతో తెలుగు నిర్మాతలు చిక్కుల్లో పడ్డారు.

ఈ పిటిషన్‌పై ఈ నెల మార్చి 10 తేదీన మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించిందని, ఇతర భాషల్లో ‘హీరో’ని విడుదల చేయకుండా స్టే విధించిందని దర్శకుడు బోస్కో ప్రభు తెలిపారు. అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి శుక్రవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారని పేర్కొంటూ.. ఇది కోర్టు తీర్పుని అవమానించడమే అవుతుందని కామెంట్ చేసారు. కాగా, ప్రస్తుతం కరోనా వైర‌స్ ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడడంతో ‘హీరో’ తెలుగు వెర్షన్‌ విడుదలయ్యే పరిస్థితి ఎలాగూ కనపడటం లేదు. దాంతో తెలుగులో రైట్స్ తీసుకున్న నిర్మాతల పరిస్దితి ఏమిటన్నది అయోమయంలో పడింది.
 
 ‘అభిమన్యుడు’ చిత్రంతో దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో విజయాన్ని అందుకున్న పి.ఎస్. మిత్రన్ ఈ ‘శక్తి’కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ‘హలో’లో అఖిల్ సరసన, ‘రణరంగం’లో శర్వానంద్ సరసన నటించిన కల్యాణీ ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్.

నిర్మాత కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ “సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రజల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో తీశాం. తమిళనాడులో ప్రేక్షకులందరికీ సినిమా నచ్చింది. రివ్యూస్ చూడండి. తెలుగు ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ సినారియో గురించి డిస్కస్ చేసిన సినిమా ‘శక్తి’. ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సినిమా అంటే ‘జెంటిల్‌మేన్’ గుర్తుకు వస్తుంది. బేసికల్లీ… ఈ సినిమా ప్రజెంట్ డే ‘జెంటిల్‌మేన్’. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కరెక్ట్ చేయడానికి ‘జెంటిల్‌మేన్’ వస్తే ‘శక్తి’లా ఉంటాడు. దర్శకుడు మిత్రన్ ఎంత అద్భుతంగా సినిమా తీశారో తెలుగు ప్రేక్షకులకు తెలుసు.

 ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాల గురించి చర్చించారు. ఈ సినిమాలో విద్యావ్యవస్థ గురించి చర్చించారు. ‘రెమో’, ‘సీమ రాజా’లో శివ కార్తికేయన్ నటనను తెలుగు ప్రేక్షకులు చూశారు. ఆయా సినిమాల్లో పాత్రలకు భిన్నమైన పాత్రను ఈ సినిమాలో ఆయన చేశారు. నటుడిగా వైవిధ్యం చూపించారు. యాక్షన్ కింగ్ అర్జున్ గారు సినిమాకి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆయన సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లారు. అభయ్ డియోల్ దక్షిణాది సినిమాకు కొత్త. హిందీలో పలు సినిమాలు చేసిన ఆయన, ఈ సినిమాలో ఆయన ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రివ్యూల్లో ఆయన పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.  ” అన్నారు.

శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్, అర్జున్, అభయ్ డియోల్, ఇవానా తదితరులు నటించిన ఈ చిత్రానికి ర‌చ‌న‌: పి.య‌స్‌.మిత్ర‌న్‌, పార్తిబ‌న్‌, స‌వారి ముత్తు, ఆంటోనీ భాగ్య‌రాజ్‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియ‌మ్స్, ఎడిటింగ్‌: రూబెన్‌, మాట‌లు: రాజేష్ ఎ మూర్తి, పాటలు : రాజశ్రీ సుధాకర్. 

Follow Us:
Download App:
  • android
  • ios