తమకింద పనిచేసే టెక్నీషియన్స్ ను సొంత వారిలా చూసేకునే మేకర్స్ చాలా తక్కువగా ఉంటారు. అందులో తమిళ దర్శకుడు వెట్రిమార్ ముందు వరుసలో ఉంటారు. రీసెంట్ గా తన టీమ్ .. తన సినిమా సక్సెస్ లో భాగం చేయడంతో పాటు..  అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచాడు వెట్రిమారన్.  

ఒక సినిమా హిట్ అయితే అందులో దర్శకుడు,హీరో...నటీనటుల పాత్ర ఎంత ఉంటుందో.. తెరవెనుకు కష్టపడే టెక్నీషియన్స్ పాత్ర కూడా అంతే ఉంటుంది. అటువంటి టెక్నీషియన్స్ ను.. సొంతవారిలా చూసుకునే మేకర్స్ చాలా తక్కువమంది ఉంటారు. అందులో మన తెలుగు దర్శకుడు తేజ ఒకరైతే.. తమిళంలో వెట్రిమారన్ కూడా ఈ కోవకే వస్తారు. జయం సినిమా టైమల్ లో డైరెక్టర్ తేజ తన సినిమా కోసం పనిచేసినవారికి అపార్ట్మెంట్ లో ప్లాట్ లు కొని ఇచ్చారు. అప్పుడు ఈ విషయం వైరల్ అయ్యింది. ఇక ఇన్నాళ్ళకు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ కూడా ఇదే పనిచేశాడు. 

 హీరో ఇమేజ్.. స్టార్ డమ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం బలమైన కథతో సినిమాలు తెరకెక్కిస్తుంటారు తమిళ దర్శకుడు వెంట్రిమారన్. అందేకే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరిగా వెట్రి మారన్ ఉన్నారు. అంతే కాదు అద్భుతమైన విజయాలు కూడా అందుకుంటారు. వెట్రి మారన్ సినిమా రూపొందించే క్రమంలో హీరోకి భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్లు లాంటివి ఏమీ ఉండవు. సాధారణంగా షూటింగ్ సమయాల్లో దర్శకుడికి సగం పనిభారం తగ్గిస్తుంటారు సహాయ దర్శకులు. అందుకే చాలా మంది తమ సహాయ దర్శకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. 

తన దగ్గర పని చేసేవారికి అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు.. వారి బాగోగులు కూడా చూసుకుంటుంటారు వెంట్రిమారన్. చేస్తుంటారు.. అవసరమైతే పర్సనల్ గా సహాయం కూడా చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో వెట్రి మారన్ స్టైలే వేరు. తన అసిస్టెంట్ డైరెక్టర్లను చాలా బాగా చూసుకోవడమే కాదు ప్రతీ సినిమాకు వారికి ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇస్తుంటాడు. ఇక సినిమా హిట్ అయితే.. సర్ ప్రైజ్ లు ఇవ్వడం కూడా ఆయనకు అలవాటు. 

ఈక్రమంలో వెట్రిమారన్ తాజాగా తమిళ కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా విడుతలై. ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ మూవీ మార్చ్ 31 న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దాంతో దిల్ ఖుష్ అయిన దర్శఖుడు వెట్రిమారన్ తన అసిస్టెంట్స్ అందరికి ప్లాట్లు గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ మూవీ సక్సెస్ కి కారణం అయిన 25 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు వెట్రి మాన్ తలా ఓ ఫ్లాట్ కొనిచ్చారు. అంతేకాదు మూవీ టీమ్ మొత్తానికి ఆయన బంగారు నాణేన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది.