విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తమిళంలో ‘వర్మ’గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమిళ  స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్‌ విక్రమ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో సంచలనం సృష్టించిన ఈ సినిమాపై తమిళంలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

[విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ ట్రాక్]

ముఖ్యంగా తనకు శివపుత్రుడు సినిమాతో బ్రేక్ ఇచ్చన దర్శకుడు బాల..అదే స్దాయిలో తన కుమారుడు కెరీర్ కు ఓ అద్బుతమైన హిట్ ఇస్తారని భావించారు. అయితే అంతా తలక్రిందులైంది. సినిమా పరమ చెత్తగా వచ్చిందని తమిళ మీడియా సమాచారం.

అందుతున్న తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం...ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసిన హీరో విక్రమ్ నీరు కారిపోయారట. సినిమా అసలు ఆయనకు నచ్చలేదట. వెంటనే తను ఖర్చు మొత్తం భరిస్తానని, బాల డైరక్ట్ చేసిన సినిమా మొత్తం డిలేట్ చేసేయమని ఆదేశించారట. అంతేకాకుండా సినిమా మొత్తం ఓ కొత్త దర్శకుడుతో రీషూట్ చేయమని పురమాయించారట. ఈ సంఘటనపై దర్శకుడు బాలా ఖచ్చితంగా అవమానం ఫీలవుతారు. మరి ఆయన ఎలా స్పందిస్తారు. ఇది వివాదంగా మారకుండా విక్రమ్ ఎలా జాగ్రత్తపడతారో చూడాలి. 

ఆ మధ్య  రిలీజైన ‘వర్మ’ టీజర్ ని బట్టి చూస్తే .. సినిమాలో అర్జున్ రెడ్డి ఇంట్లోని పనిమనిషి పాత్ర నిడివి పెంచినట్లుగా అర్దమవుతుంది. ఈ పాత్రను ఈశ్వరీరావు పోషిస్తున్నారు. షాలినీ పాండే పాత్రలో మేఘా చౌదరీ నటించింది. కానీ, ‘అర్జున్’ రెడ్డి సినిమాలో ఉన్నట్లే ఇందులోనూ లిప్‌లాక్స్, ఫైట్లు ఉన్నాయి.  అయినా ఫలితం లేదన్నమాట.