తమిళ సినీ నటి యషిక తన ప్రియుడు మోహన్ బాబు కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తన చావుకి కారణం మోహన్ బాబే అంటూ తల్లికి మెసేజ్ చేసి ఉరి వేసుకొని మరణించింది.
తమిళ సినీ నటి యషిక తన ప్రియుడు మోహన్ బాబు కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తన చావుకి కారణం మోహన్ బాబే అంటూ తల్లికి మెసేజ్ చేసి ఉరి వేసుకొని మరణించింది. యషిక అసలు పేరు మేరీ షీలా జేబరాని. తిరుప్పూర్ నుండి నటన మీద ఆసక్తితో చెన్నైకి వెళ్లిన యషిక కొన్ని సీరియళ్ళలో, సినిమాలలో నటించింది.
మొదట్లో హాస్టల్ లో ఉన్న యషిక అరవింద్ అలియాస్ మోహన్ బాబుతో పరిచయం ఏర్పడిన తరువాత ఇద్దరూ కలిసి నాలుగు నెలల పాటు సహజీవనం చేశారు. పెరవల్లుర్ లో జికెఎం కాలనీలో ఈ జంట కలిసి జీవించేది. వృత్తి రీత్యా మోహన్ బాబుకి సెల్ ఫోన్ సర్వీసింగ్ సెంటర్ ఉంది.
కొంతకాలం పాటు బాగానే ఉన్న వీరిద్దరి మధ్య నాలుగు రోజుల క్రితం గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాల కారణంగా ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో యషిక.. మోహన్ బాబుని ఇంటి నుండి వెల్లగొట్టింది. తీవ్ర మనస్తాపానికి గురైన యషిక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన తల్లికి మెసేజ్ ద్వారా చెప్పింది.
తనను పెళ్లి చేసుకోకుండా టార్చర్ పెట్టిన మోహన్ బాబు కారణంగానే సూసైడ్ చేసుకుంటున్నానని యషిక మెసేజ్ లో తెలిపింది. ఆమె చనిపోయిన తరువాత మోహన్ బాబుకి శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. మోహన్ బాబు మీద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం అతడిని వెతికే పనిలో పడ్డారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Feb 15, 2019, 1:01 PM IST