తమిళ నటి వనిత విజయ్‌కుమార్‌ మూడో పెళ్లి వ్యవహారం రోజుకో ములుపు తిరుగుతోంది. పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకోవటం భర్తకు లిప్‌ లాక్‌ ఇవ్వటంపై వనిత మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఇండస్ట్రీలో లక్ష్మీ రామకృష్ణన్‌, కస్తూరి లాంటి వారు కూడా వనిత మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే తన మీద మాటల దాడి ఎక్కువగా కావటంతో పోలీసులను ఆశ్రయించింది వనిత. విచారణ చేపట్టిన పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

సూర్య దేవి అనే మహిళ వనిత మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నటి కస్తూరి సహకారంతో సూర్యా దేవి వెంటనే బెయిల్ పై విడుదలైంది. కానీ అప్పటి నుంచి సూర్యదేవి కనిపించటం లేదు. అయితే అక్కడే మొదలైంది అసలు సమస్య. అయితే అరెస్ట్‌కు ముందు సూర్య దేవి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకుంది.

ఈ లోగా అరెస్ట్‌, కోర్టు, బెయిల్ ఇలా అన్ని జరిగిపోయిన తరువాత సదరు మహిళకు పాజిటివ్‌ అన్న విషయం తెలిసింది. వెంటనే ఆమె అరెస్ట్‌తో పాటు మిగతా వ్యవహారాల్లో పాల్గొన్న పోలీసులు కూడా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో ఒక కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ రావటంతో మిగతా వారిలోనూ ఆందోళన నెలకొంది. అంతేకాదు సూర్యదేవి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సమయంలో వనిత కూడా అక్కడకు వచ్చి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో వని ఆరోగ్యం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.