మరోసారి హాస్పిటల్ పాలు అయ్యారు తమిల స్టార్ హీరో.. విప్లవ నాయకుడు.. విజయ్ కాంత్. ఇంతకీ ఆయనకు మళ్లీ ఏమైంది. ఇప్పటికే ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న తమిళ స్టార్.. ప్రస్తుతం పరిస్థితి ఏంటీ..?
తమిళనాట విజయ్ కాంత్ ఫాలోయింగ్ గురించి తెలిసింది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. ఈ మధ్యే ఆయన పరిస్థితి చాలాసీరియస్ అవ్వగా.. ఎలాగోలా.. ప్రాణాపాయం నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు అంతే కాదు వచ్చీ రాగానే కదల్లేని స్థితిలో ఉన్నా కాని.. తన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి..తన భార్యను ఇన్ చార్జ్ గా నియమించారు. ఇక ఈ సమాచావేశంలో కదల్లేని పరిస్థితుల్లో ఉన్న విజయ్ కాంత్ ను చూసి అభిమానులు కన్నీరుమున్నీరు అయ్యారు.
బక్క చిక్కిపోయి.. చేయి కూడా పైకి లేపలేకపోతున్న విజయ్ కాంత్ ను చూసి ఫ్యాన్స్ బాధపడ్డారు. అంతే కాదు తమ అభిమాన తార ఇలా అయిపోయాడేంటి అని కుమిలిపోయారు. విజయ్ కాంత్ కూడా బక్క చిక్కిపోయి.. గుర్తుపట్టకుండా అయిపోయాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ కాంత్ మరోసారి హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. ఆయనకు అనారోగయం మళ్లీ తిరగబెట్టడంతో.. హాస్పిటల్ లో జాయిన్ అయ్యారంటున్నారు. డిశ్చార్చ్ అయి నెలరోజులు కూడా గడవక ముందు మళ్లీ హాస్పిటల్ లో జాయిన్ అయినట్టుతెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళనలో పడ్డారు.
అయితే ఈ విషయంలో ఫ్యామిలీ మాత్రం మరో విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆయన రెగ్యూలర్ చెకప్ కోసమే ఇలా.. హాస్పిటల్ కు వచ్చారని. అంతే కాని ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదు అంటున్నారు. కాని అభిమానలు మాత్రం విజయ్ కాంత్ మళ్ళీ డిశ్చార్జ్ అవుతేనే తమకు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు.
చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తమిళ నటుడు DMDk అధినేత విజయ్ కాంత్. చాలా సార్లు ఆయనకు సీరియస్ అయ్యింది.. ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇక గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయిన విజయ్ కాంత్.. నడవడానికి కూడా వీలు లేకపోవడంతో.. వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. కెప్టెన్ విజయ్ కాంత్.. తమిళతెరను ఊపు ఊపేసిన హీరో.. విప్లవ నాయకుడిగా పేరు సంపాదించిన నేత, కెప్టెన్ బిరుదును పొంది.. లక్షలాది హృదయాలను గెలిచిన హీరో. రీల్ హీరోగానే కాదు..రియల్ హీరోగా ఆయనకు పేరుంది.
