తమిళ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా మరో సినీ ప్రముఖుడుని బలితీసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్‌ సుభా శనివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతోపాటు చెన్నలోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం(మే 29) తుది శ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. 

వెంకట్ సుభా `మొజి`, `అఘగియా తీయే`, `కందనాల్ ముధల్` వంటి చిత్రాలకు పనిచేశారు. అంతేగాక పలు తమిళ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. టూరింగ్ టాకీస్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆయన సినిమా రివ్యూయర్‌గా వ్యవహరించారు. వెంకట్‌ సుభా మరణం పట్ల పలువరు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. వెంకట్‌ సుభా మృతి బాధాకరం అంటూ నటి రాధిక శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌లతో పాటు పలువురు నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు.