టాలీవుడ్ లో 'రాజు గారి గది' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు ఓంకార్. ఈ సినిమా సక్సెస్ కావడంతో 'రాజు గారి గది 2' తెరకెక్కించాడు. అందులో నాగార్జున, సమంత వంటి స్టార్లు నటించడంతో సినిమాపై హైప్ వచ్చి పెద్ద సక్సెస్ అయింది.

అదే సమయంలో 'రాజు గారి గది 3' తీస్తానని చెప్పాడు ఓంకార్. ఇప్పుడు ఆ సినిమా పనులు షురూ చేశాడు. ఈ సినిమాలో కూడా స్టార్ యాక్టర్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా తమన్నాని సంప్రదించినట్లు తెలుస్తోంది.

కథ నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించిందట మిల్క్ బ్యూటీ. అయితే రెమ్యునరేషన్ గా కోటిన్నర డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు  ఒక్కో సినిమాకు డెబ్బై లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న తమన్నా సడెన్ గా తన రెమ్యునరేషన్ పెంచేసింది.

'ఎఫ్ 2' సినిమా హిట్ అవ్వడం తమన్నాకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు దర్శకనిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా  కాకుండా గోపీచంద్ సినిమా కూడా కమిట్ అయిందని టాక్. వీటికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సివుంది!