భీమవరం వెళ్లిన తమన్నా.. పవన్ ని కలుస్తారా..? అభిమాని ప్రశ్న!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Aug 2018, 5:32 PM IST
tamannah about pawan kalyan
Highlights

హిందీ కన్నా తెలుగు బాలా మాట్లాడగలనని, ముంబైలో పుట్టినా తెలుగు అమ్మాయిలాగా చూస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ భీమవరంలోనే ఉన్నారు.. ఆయనను కలుస్తారా..? అని ప్రశ్నించగా ఆయన ఇక్కడ ఉన్న తెలియదని, చాలా సింపు గా ఉండే ఆయన్ను చూస్తూ స్ఫూర్తి పొందుతానని అన్నారు. 

హ్యాపీ మొబైల్ మల్టీబ్రాండ్ రిటైల్ స్టోర్ షోరూం ఆరంభోత్సవ వేడుక కోసం ప్రముఖ నటి తమన్నా సోమవారం భీమవరం ప్రాంతానికి వెళ్లారు. స్టోర్ ని ప్రారంభించిన ఆమె అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఇది హీరో ప్రభాస్ సొంత ఊరా అయితే మీకోసం ప్రభాస్ కి చెప్పనా..? అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. భీమవరం పరిసర ప్రాంతాలు కాలుష్యం లేకుండా ఉన్నాయని అన్నారు.

హిందీ కన్నా తెలుగు బాలా మాట్లాడగలనని, ముంబైలో పుట్టినా తెలుగు అమ్మాయిలాగా చూస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ భీమవరంలోనే ఉన్నారు.. ఆయనను కలుస్తారా..? అని ప్రశ్నించగా ఆయన ఇక్కడ ఉన్న తెలియదని, చాలా సింపు గా ఉండే ఆయన్ను చూస్తూ స్ఫూర్తి పొందుతానని అన్నారు. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదని నవ్వేశారు. ప్రస్తుతం ఆమె 'దటీజ్ మహాలక్ష్మి, సైరా' చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.

సైరాలో చిరంజీవి పక్కన నటించడం ఆనందంగా ఉందని చెబుతూ.. ప్రభాస్, రానా, రామ్ చరణ్ లు తనకు మంచి స్నేహితులను అన్నారు. అభిమానులు తమన్నాని డాన్స్ చేయాలని కోరడంతో స్వింగ్ జరా పాటకి స్టెప్పులు వేశారు. తనతో పాటు అభిమానులను కూడా డాన్స్ చేయాలని కోరారు.    

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader