ఒకప్పుడు బాలయ్య సినిమాలో నటించటానికి హీరోయిన్స్ ఉత్సాహం చూపించేవారు. కానీ కాలం మారింది. బాలయ్య సీనియర్ హీరో అయ్యారు...ఆయనతో చేయటానికి హీరోయిన్స్ దొరకని సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. అప్పటికీ సీనియర్స్ ని అడుగుతున్నా వాళ్లూ సైతం నో చెప్పటం బాలయ్యని నిరుత్సాహ పరుస్తోందని చెప్తున్నారు. అయితే హీరోయిన్స్ కు వాళ్ల తరపు నుంచి రకరకాల కారణాలు ఉన్నాయి. రీసెంట్ గా తమన్నా ని బాలయ్య, బోయపాటి సినిమా కోసం అడిగితే నో చెప్పిందని సమాచారం. 

వివరాల్లోకి వెళితే...రీసెంట్ గా బాలయ్య,బోయపాటి చిత్రం పట్టాలు ఎక్కి పరుగులు పెడుతోంది. ఇద్దరికీ హిట్ అవసరం. దాంతో ఇద్దరూ ఈ ప్రాజెక్టుకు సంభందించిన ప్రతీ విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే బాలయ్య సరసన ఓ మంచి హీరోయిన్ ని వెతకాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ సరైన స్టార్ సెట్ కాలేదు. దాంతో తమన్నాని ఎప్రోచ్ అయ్యారు. కెరియర్ ను ఆరంభించిన కొద్ది కాలంలోనే తమన్నా అగ్రస్థాయికి దూసుకెళ్లిన.. వరుస సినిమాలతో .. వరుస విజయాలతో తన సత్తా చాటుకుంది. అయితే ఆ మధ్య వరస ప్లాఫ్ లతో తమన్నా జోరు కాస్త తగ్గినా, 'ఎఫ్ 2' సినిమా నుంచి ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంది. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ఆమె తిరిగి ఫామ్ లోకి వస్తాను అనుకుంటే అది జరగలేదు. చిరంజీవితో భారీ సినిమా చేసిన ఆమెకి తాజాగా బాలకృష్ణ సరసన చేసే ఛాన్స్ లభించింది.

బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో త్వరలో రూపొందే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తమన్నాను అడిగారట. అయితే ఈ ఆఫర్ ను తమన్నా సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పుకుంటున్నారు. ఆమె చెప్పిన రెమ్యునేషన్ బాగా ఎక్కువని తెలుస్తోంది. నోటీతో నో చెప్పకుండా ఇలా ప్లే చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే  బాలకృష్ణ సినిమాకి నో చెప్పేంత బిజీగా అయితే తమన్నా లేదు. అలాగని బాలయ్యతో సినిమా చేస్తే ఇప్పటికే చిరంజీవి తో చేసి సీనియర్ అనిపించుకుంది. ఇక తన కెరీర్ కేవలం సీనియర్ హీరోలకే అంకితమైపోతుందని భయపడుతోందిట. దాంతో అటు నో చెప్పలేక, ఇటు యస్ చెప్పలేక...చివరకు ఇలాంటి రేమ్యునషన్ ఫిటింగ్ పెట్టిందిట. ఈ విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్  గా మారింది.