మిల్కీ బ్యూటీ తమన్నాకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కమర్షియల్ చిత్రాల్లో కాస్త తమన్నా జోరు తగ్గిందనే చెప్పొచ్చు. కానీ తనకు వచ్చిన అవకాశాలతోనే తమన్నా అందాలు ఆరబోస్తోంది. రాజుగారి గది చిత్రంతో ఓంకార్ దర్శకుడిగా మారాడు. రాజుగారి గది 3కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

దీనితో ఓంకార్ రాజు గారి గది 3ని ప్రారంభించాడు. గత వారమే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తమన్నా ప్రధాన  నటిస్తోందని ప్రకటించారు. ప్రారంభోత్సవానికి కూడా తమన్నా హాజరైంది. అంతలోనే చిత్రయూనిట్ కు భారీ షాక్. ఈ చిత్రం నుంచి తమన్నా తప్పుకుందంటూ వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఓంకార్ వల్లే తమన్నా ఈ చిత్రం నుంచి తప్పుకుందని సమాచారం. 

తమన్నా ఈ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తి చూపింది. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడకం వెనుక బలమైన కారణం ఉందట. ఓంకార్ 6 నెలల క్రితమే రాజుగారి గది 3 కథని తమన్నాకి వినిపించాడట. ఆ సమయంలో కథ, తన పాత్ర తమన్నాని బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే ఒకే చెప్పేసింది. 

ఇటీవల చిత్ర ప్రారంభోత్సవం ముగిశాక ఓంకార్ తమన్నాకు ఫైనల్ నేరేషన్ ఇచ్చాడట. కథలో ఓంకార్ చాలా మార్పులు చేశాడట. దీనితో తమన్నా తన పాత్ర విషయంలో సంతృప్తి చెందలేదని సమాచారం. దీనితో సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా తప్పుకోవడంతో ఆమె స్థానంలో కొత్తవారిని తీసుకుంటారా లేక తమన్నానే బుజ్జగిస్తారా అనేది వేచి చూడాలి. తమన్నా తప్పుకోవడంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు.