మిల్కీ బ్యూటీ తమన్నా.. కోలీవుడ్‌లో రజనీకాంత్‌తో ఓ సినిమా చేస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు తమన్నా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 

మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్‌ బ్యూటీగా రాణించిన విషయం తెలిసిందే. అందమైన నడుముని చూపిస్తూ, అదిరిపోయే డ్యాన్సు నెంబర్లతో హీరోయిన్‌గా అలరించింది. కానీ ఆమె గత కొన్ని రోజులుగా రూట్‌ మార్చినట్టుంది. గ్లామర్‌ ట్రీట్‌ని తగ్గించి నటనకుస్కోప్‌ ఉన్న సినిమాలు, అలాంటి పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. అదే సమయంలో ఆశ్చర్యపరిచే ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతూ దూసుకుపోతుంది. తెలుగులో ఈ బ్యూటీ మెగాస్టార్‌తో `భోళాశంకర్‌` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇక తమిళంలో సూపర్‌ స్టార్‌తో చేస్తుంది. `జైలర్‌`లో రజనీకాంత్‌తో నటిస్తుంది. ఇందులో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎట్టకేలకు తమన్నా కన్పమ్‌ చేసింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్ లో `జైలర్‌` పోస్టర్స్ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. `ఫైనల్‌గా నేను మీ అందరితోనూ పంచుకోవాల్సిన వార్త బయటకు వచ్చింది. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన `జైలర్‌` చిత్రంలో తలైవర్ రజనీకాంత్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గౌరవంగా భావిస్తున్నా. ఈ అనుభవాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఉన్నా` అని పేర్కొంది తమన్నా. 

`బీస్ట్` ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. హీరోయిన్‌గానే కాదు, ఆమె బలమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, కన్నడ శివన్న శివరాజ్‌కుమార్‌లతోపాటు టాలీవుడ్‌ నుంచి సునీల్‌ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. 

View post on Instagram

తమన్నా ప్రస్తుతం తెలుగులో `భోళాశంకర్‌`తోపాటు మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చి `బాంద్రా` చిత్రంలో నటిస్తుంది. దిలిప్‌ కుమార్‌తో జోడి కట్టింది. హిందీలో ఓ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ఓటీటీలోనూ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇప్పటికే నాలుగు వెబ్‌ సిరీస్‌ చేసిన ఈ భామ ప్రస్తుతం `జీ కర్దా` అనే హిందీ సిరీస్‌లో నటిస్తుంది.