తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కలల ప్రాజెక్టు ని రాంచరణ్ 200 కోట్ల బడ్జెట్ లో నిర్మించడం విశేషం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రంతో ప్రేక్షకులని మెప్పించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

సైరా చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. తమన్నాసైరా చిత్రం గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. ఈ చిత్రంలో తమన్నా లక్ష్మీ పాత్రలో నటిస్తోంది. 

'సైరా చిత్రానికి హిందీ డబ్బింగ్ పూర్తి చేశా. సైరా చిత్రం, లక్ష్మి పాత్ర నాకు ఓ గొప్ప అనుభూతి. మీఅందరిని థియేటర్స్ లో కలుసుకుంటా అని తమన్నా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఎడిటింగ్ స్క్రీన్ పై అందంగా ఉన్న తన ఫోటోని తమన్నా షేర్ చేసింది.