హోలీ డే సందర్భంగా సెలబ్స్ రంగుల్లో మునిగితేలుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి రంగుల పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కు విషెస్ తెలిపారు. తమన్నా కూడా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.
వసంత రుతు శోభకు వర్ణమయంగా, సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ- హోలీ (Holi).. ప్రస్తుం హోలీ సెలబ్రేషన్స్ ను చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలు అనే భేదాల్లేకుండా రంగులు జల్లుకుంటున్నారు. కొన్నేండ్ల సెలబ్రేటీలు కూడా హోలీ పండుగను తమదైన శైలిలో జరుపుకుని హోలీ ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మిల్క్ బ్యూటీ తమన్నా కూడా హోలీ సందర్భంగా ఒక పోస్ట్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీలో బిజీగా ఉన్నారు. ఎంత షూటింగ్ లో ఉన్నా సోషల్ గా కనెక్ట్ అయ్యే ఉంటారు.. మహేశ్ బాబు. రీసెంట్ గా బంజారాహిల్స్ లోని రేయిన్ బో చిల్ట్రన్ హాస్పిటల్స్ వారి ప్యూర్ లిటిల్ హాట్స్ ఫౌండేషన్స్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసింది. ఈ ఫాండేషన్ ద్వారా 120 మందికి పైగా హార్ట్ డిసీస్ తో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన చికిత్స అందించనున్నారు. ఇలా తనలోని మానవతా ద్రుక్పథాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటున్నాడు మహేశ్. తాజాగా హోలీ డే సందర్భంగా తన ఫ్యాన్స్, తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కు విషెస్ తెలిపారు.
ఈ మేరకు మహేశ్ బాబు ట్విట్టర్ వేదికన విషెస్ తెలియజేస్తూ.. ‘మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రోజు ప్రేమ, ఆనందం మరియు చైతన్యంతో నిండి ఉంటుందని భావిస్తున్నా.. కానీ సురక్షితంగా..’ అంటూ ట్విట్ చేశాడు. ఇందుకు ఫ్యాన్స్ కూడా మహేశ్ బాబుకు హోలీ డే విషెస్ తెలుపుతునన్నారు. మార్చి 20న సర్కారు వారి పాట నుంచి సెకండ్ సింగిల్ రానున్నందున ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే తమన్నా (Tamannaah Bhatia) కూడా హోలీ సందర్భంగా ట్రెండీ వేర్ లో ఓ ఫొటోను తన అభిమానులతో పంచుకున్నారు. ‘హోలీ వైబ్స్ ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోనెట్టింట వైరల్ అవుతోంది.
