సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మాక్‌ఫీ ఎప్పటిలాగే  ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాను  విడుదల చేసింది. ఆ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లు నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నారు. వీరి పేర్లతో లింక్ చేయబడిన ప్రమాదకరమైన సైట్ల వల్ల వీరందరూ ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాలో చేరారు. వీరి పేర్ల మీద కొన్ని సైట్లు ఫ్రీ మెంబర్ షిప్, ఫ్రీ కంటెంట్ ఇస్తామంటూ కొన్ని యాడ్స్ ఇవ్వడంతో.. వినియోగదారులు ఆయా సైట్లను ఓపెన్ చేస్తున్నారు. ఫలితంగా చిక్కుల్లో పడుతున్నారని చెప్పారు. 

ఆ విధంగా వినియోగదారులను రిస్క్‌లో పడేసే సైట్లు పలువురు ప్రముఖులను, వారి పేర్లను వాడుకుంటున్నాయి. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ తారలు టబు, తాప్సీ పన్నూ, అనుష్క శర్మలు కూడా ఉండటం విశేషం. 

ఇక మాక్‌ఫీ యొక్క మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ జాబితా 2020 యొక్క 14వ ఎడిషన్ షోబిజ్ నుంచి విడుదలయింది. కరోనా కాలంలో కన్సూమర్స్ .. మునుపెన్నడూ లేనంతగా  ఫ్రీ ఎంటర్టైన్మెంట్  కోసం నెట్‌లో సెర్చ్ చేస్తుండటంతో.. సైబర్‌ క్రిమినల్స్ వారిని టార్గెట్ చేస్తున్నారని ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ మరియు మాక్‌ఫీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ కృష్ణపూర్ అన్నారు.

 " ఏ మాత్రం డౌట్ లేని వినియోగదారులు తరచూ ప్రధాన  స్పోర్ట్స్ పోగ్రామ్ లు, సినిమా , టీవీ కార్యక్రమాలతో పాటు ఫొటోలు మరియు తమ అభిమాన ప్రముఖుల వీడియోలను, లీక్ చేసిన ఉచిత మరియు పైరేటెడ్ కంటెంట్ కోసం చూస్తారు.  సైబర్ క్రైమినల్స్  వినియోగదారులకు పాప్ సంస్కృతిపై మోహాన్ని పెంచుతారు ఆ తర్వాత వారి మొబల్స్ లేదా సిస్టమ్స్ లో  మాల్వేర్లను ఇన్‌స్టాల్ చేసే  వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేస్తారు ”అని కృష్ణపూర్ ఒక ప్రకటనలో తెలిపారు.

"వినియోగదారులు సౌలభ్యం మరియు ఉచితాల మోజులో పడి భద్రతపై రాజీపడినప్పుడు, వారు వారి డిజిటల్ జీవితాలను ప్రమాదంలో పడేస్తారు.  సినీ అభిమానులు అప్రమత్తంగా ఉండటం, ఉచిత కంటెంట్‌కు  ప్రామిస్ చేసే అనుమానాస్పద లింక్‌లను డిలేట్ చేయటం, మరియు క్లిక్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం చాలా అవసరం, ”అన్నారాయన.