త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. వీళ్ళిద్దరిది సూపర్ హిట్ కాంబో కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనివున్నాయి. అందాల తార పూజా హెగ్డే రెండవసారి బన్నీతో రొమాన్స్ చేస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. 

ఇటీవల త్రివిక్రమ్ చిత్రాలలో సీనియర్ నటీమణులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, సన్నాఫ్ సత్యమూర్తితో స్నేహ నటించారు. ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అలనాటి హాట్ హీరోయిన్ టబుతో కీలక పాత్ర చేయిస్తున్నాడు. 

తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటించేందుకు టబు హీరోయిన్ పూజా హెగ్డే కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అంధాదున్, దే దే ప్యార్ దే చిత్రాలు ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో టబు క్రేజ్ బాగా పెరిగింది. దీనితో టబు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వక తప్పలేదు. 

హీరోయిన్ కంటే ఎక్కువగా డిమాండ్ చేసినా త్రివిక్రమ్ టబునే కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీనితో నిర్మాతలు ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేస్తున్నారు.