ఇటీవల ఓ హీరోయిన్‌ భార్యకి నచ్చలేదని, తనని సినిమాలోనుంచి తీసేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. బైక్‌ రైడింగ్‌ చేస్తూ బుక్కైపోయింది. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, బోల్డ్ కామెంట్లతో అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్న తాప్సీ తనకిష్టమైన బైక్‌ రైడింగ్‌ చేసింది. 

బైక్‌ రైడ్‌ చేయడం తప్పు కాకపోయినప్పటికీ, హెల్మెట్‌ ధరించకపోవడం తప్పుడు. అన్నీ తెలిసిన తాప్సీ అదే తప్పు చేసింది. థ్రిల్‌ కోసం హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్‌ చేసి పోలీసులకు దొరికిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఫైన్‌ కట్టాలని చెప్పారు. తనకు ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించిన విషయం చెబుతూ, తాప్సీ బైక్‌ రైడ్‌ ఫోటోని తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. అయితే ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించి బైక్‌ డ్రైవ్‌ చేయాలని పేర్కొంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

ఇదంతా తాను నటిస్తున్న `రష్మీ రాకెట్‌` సెట్‌లో చోటు చేసుకుంది. అంతేకాదు మరో ఫోటోని పంచుకుంటూ `నా దివాళి గిఫ్ట్స్ తో నేను` అని పేర్కొంది. ఇందులో మమ్మీ అండ్‌ పుచి అనే యాష్‌ ట్యాగ్‌ని పంచుకుంది. రష్మీ రాకెట్‌ సెట్‌లో అని పేర్కొంది. ఇందులో వాళ్ల మమ్మీపై కూర్చొని ఉంది తాప్సీ. దీంతోపాటు `శెభాష్‌ మిత్తు` చిత్రంలో కూడా తాప్సీ నటిస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)