Asianet News TeluguAsianet News Telugu

ఆ మూడు రోజుల దాడిలో జరిగిన మూడు ముఖ్య విషయాలు ఇవే...!

ఐటీ దాడుల అనంతరం సోషల్ మీడియా ద్వారా స్పందించారు  తాప్సి. మూడు రోజుల అధికారుల సోదాలలో ఏమి జరిగిందన్న విషయాన్ని ఆమె వెల్లడించారు. తనకు ప్యారిస్ లో ఓ విలాసవంతమైన భవనం ఉందని భావించారు. దాని తాళాల కోసం వెతికారని తాప్సి పేర్కొన్నారు. తరువాత తాను రూ. 5 కోట్ల రూపాయల మొత్తం ఒకరి దగ్గర తీసుకున్నాను అని, ఆ అమౌంట్ రిసిప్ట్ కోసం వెతికారు. అది కూడా వారికి దొరక లేదు. 
 

taapsee satires over it raids take twitter made sensational comments ksr
Author
Hyderabad, First Published Mar 6, 2021, 2:27 PM IST

హీరోయిన్ తాప్సి పన్ను నివాసం, కార్యాలయలలో జరిగిన ఐటీ అధికారుల సోదాలు బాలీవుడ్ లో కలకలం రేపాయి. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై కూడా అదే సమయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. వందల కోట్ల పన్ను ఎగవేతకు సదరు సెలెబ్రిటీలు పాల్పడ్డారు అనేది సోదాల వెనుకున్న కారణంగా తెలుస్తుంది. దాదాపు మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరగడం జరిగింది. 


కాగా ఐటీ దాడుల అనంతరం సోషల్ మీడియా ద్వారా స్పందించారు  తాప్సి. మూడు రోజుల అధికారుల సోదాలలో ఏమి జరిగిందన్న విషయాన్ని ఆమె వెల్లడించారు. తనకు ప్యారిస్ లో ఓ విలాసవంతమైన భవనం ఉందని భావించారు. దాని తాళాల కోసం వెతికారని తాప్సి పేర్కొన్నారు. తరువాత తాను రూ. 5 కోట్ల రూపాయల మొత్తం ఒకరి దగ్గర తీసుకున్నాను అని, ఆ అమౌంట్ రిసిప్ట్ కోసం వెతికారు. అది కూడా వారికి దొరక లేదు. 


ఇక మూడవ ముఖ్య విషయం... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్లు 2013లో తనపై ఐటి దాడులు జరిగిన విషయం నాకు గుర్తు లేదని.. సెటైర్ వేశారు. తాప్సి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనురాగ్ మరియు తాప్సిలపై ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు జరిగాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో కూడా తాప్సి పై ఐటి దాడులు జరిగాయి. గతంలో ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదని ఆమె అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios