తాప్సి లక్కేమిటో గాని సౌత్ లో పెద్దగా సక్సెస్ లు అందుకోకుండానే బాలీవుడ్ తెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. సినిమా సినిమాకు షైన్ అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది.
తాప్సి లక్కేమిటో గాని సౌత్ లో పెద్దగా సక్సెస్ లు అందుకోకుండానే బాలీవుడ్ తెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. సినిమా సినిమాకు షైన్ అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్ తో ఆకర్షిస్తోన్న తాప్సి ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కనిపించింది.
ట్రెడిషనల్ లుక్ నుంచి బికినీ వరకు అన్ని వెరైటీలలో అందాలను ఆరబోసిన సొట్ట బుగ్గల సుందరి వయసు పై బడిన మహిళగా కనిపిస్తే అభిమానులు తట్టుకోగలరా?. అయితే సాంద్ కి ఆంఖ్ అనే సినిమాలో అమ్మడు 80 ఏళ్ల వృద్దురాలిగా కనిపించనుందట. తుషార్ హీరా నందాని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేశారు.
తాప్సితపో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న భూమి పడ్నేకర్ కూడా కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ ఇద్దరు కూడా రఫ్ లుక్ తో కనిపిస్తూ నార్త్ సైడ్ ఉండే మహిళల్ని గుర్తు చేస్తున్నారు. గన్స్ తో షూటర్లు గా మారిన అమ్మమ్మలు ఎలాంటి ఖ్యాతిని గడించారు అనేది అసలు కథ.
అంతా బాగానే ఉంది గాని తాప్సి లుక్స్ పరంగా ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది. మేకప్ కాస్ట్యూమ్ ఆమెకు అంతగా సెట్టవ్వలేదు;. ఎడిసినట్టే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అమ్మడు ఈ సినిమాతో ఎంత వరకు హిట్ అందుకుంటుందో చూడాలి.
