Asianet News TeluguAsianet News Telugu

#Taapsee:తాప్సీ కొత్త సినిమా, రిలీజ్ కు ముందే డిజాస్టర్ ?

 తాప్సీ తాజా చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా డిజాస్టర్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

Taapsee Dobaaraa Disaster Even Before Release?
Author
Mumbai, First Published Aug 18, 2022, 11:15 AM IST

అసలే బాలీవుడ్ పరిస్దితి బాగోలేదు. పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలు వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏ సినిమా సరైన కలెక్షన్స్ నమోదు చెయ్యటంలేదు. ఈ క్రమంలో తాప్సీ తాజా చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా డిజాస్టర్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. 

అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ రాణిస్తున్న హీరోయిన్ తాప్సీ. కొద్ది రోజుల క్రితం వ‌చ్చిన శ‌భాష్ మిథు అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్లాప్ ను మూట గ‌ట్టుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ఏ మాత్రం వెనకడుగు వెయ్యకండా మ‌రో విజయం కోసం క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం తాప్సీ న‌టించిన దోబారా చిత్రం ఆగ‌స్టు 19 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో ఈ సినిమా డిజాస్టర్ అంటూ టాక్ మొదలైంది. 

అందుకు కారణం ఈ సినిమాకు బాగా తక్కువ బజ్ ఉండటం..అలాగే బాలీవుడ్ లో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ సినిమాలు డిజాస్టర్ కావటం. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు లక్షల్లో ఓపినింగ్స్ వస్తాయని, కోట్లు రావని ట్రేడ్ అంటోంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా కొనటానికి ఉత్సాహం చూపించలేదని తెలుస్తోంది.  ట్రేడ్ ఎనాలసిస్ట్ లు ఈ సినిమా తాప్సీకు మరో డిజాస్టర్ అని తేల్చేస్తున్నారు.  తాప్సీ, అనురాగ్ కశ్యప్ లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా క్యాంపైన్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో సినిమాని ముందుకు తీసుకెళ్ళటం కష్టమే అంటున్నారు ఎగ్జిబిటర్స్. 

 వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అంతేకాదు.. నిర్మాతగా మారి తన టేస్ట్ తగ్గ సినిమాలు నిర్మించే పని కూడా మొదలుపెట్టింది. తాప్సీ పన్ను, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘దోబారా’. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా ‘మిరాజ్‌’కి రీమేక్ ఇది.  అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ మిస్టరీ డ్రామా  సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios