ఇన్నాళ్లకు నటి తాప్సీ ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం ఓ క్రికెటర్ తో తాప్సీ ప్రేమాయణం సాగించిందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా తన ప్రేమ, పెళ్లి విషయాలపై తాప్సీ స్పందిచింది.

గాసిప్స్ కోసం కాకుండా.. తన వ్యక్తిగత జీవితం గురించి నిజాయితీగా తెలుసుకోవాలని అనుకుంటున్న వారికోసం చెబుతున్నానంటూ తన ప్రేమ విషయం చెప్పింది. తన జీవితంలో ఉన్న వ్యక్తి అందరూ అనుకుంటున్నట్లుగా నటుడో, క్రికెటరో కాదని.. కనీసం అతడు మన చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా లేడని చెప్పింది. 

పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు పిల్లలు కావాలనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ సమయంలో తాప్సీ సోదరి షగున్  కల్పించుకొని.. 'ఈ విషయంలో తాప్సీ నాకు థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే నా వల్లే తనకు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది' అని చెప్పారు. 

టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవల 'మిషన్ మంగళ్'తో సక్సెస్ అందుకున్న తాప్సీ ప్రస్తుతం 'తడ్కా', 'షాంద్ కీ ఆంఖ్' వంటి చిత్రాల్లో నటిస్తోంది.