ఇటీవల గుండెపోటుతో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుష్మా స్వరాజ్ మరణించినప్పటి నుంచి ఆమెకు సంబందించిన గతం గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఆమె నవ్వు వెనుక ఎన్నో చేదు అనుభవాలు పోరాట పటిమ, కరుణ, ప్రేమ వంటి విషయాలు ఉన్నాయని అందరిని ఆలోచింపజేసింది. 

అయితే సుష్మా స్వరాజ్ బయోపిక్ ని తెరకెక్కిస్తే బావుంటుందని బాలీవుడ్ లో చాలా మంది సినీ ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. రీసెంట్ గా తాప్సి కూడా ఆ విషయంపై పాజిటివ్ గా స్పందించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తాప్సి నెక్స్ట్ మిషిల్ మంగళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుష్మా స్వరాజ్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా నటిస్తాను అని, ఆమె జీవిత ఆధారంగా తెరకెక్కే కథలో తాను ఒక భాగమైతే నాకు అంతకంటే గొప్ప అదృష్టం మరొకటి ఉండదని అది గర్వంగా ఫీలవుతానని తాప్సి తన వివరణను ఇచ్చింది.