సైరా చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర తొలి రోజు ఓపెనింగ్స్ ట్రేడ్ విశ్లేషకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి రోజు సైరా చిత్రం రికార్డులు నెలకొల్పుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

ఇక తెలుగు సినిమాకు యూఎస్ సాలిడ్ మార్కెట్. పెద్ద హీరోల సినిమాలకు యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక సైరా చిత్రం యూఎస్ లో ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ దాటుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. 

యూఎస్ లో బాహుబలి 2, అజ్ఞాతవాసి లాంటి చిత్రాలు ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. బాహుబలి 2 చిత్ర యుఎస్ ప్రీమియర్స్ కు దాదాపుగా టికెట్ ని 40 డాలర్ల వరకు విక్రయించాలరు. అజ్ఞాతవాసి చిత్రానికి 25 డాలర్ల వరకు విక్రయించారు. 

అమెరికాలో టికెట్లకు ఆఫర్స్ ఇచ్చే సంస్థ ప్రస్తుతం రద్దయింది. అత్యధిక ధర వెచ్చించి సినిమా చూడడానికి ఎన్నారైలు కాస్త ఆలోచిస్తారు. సాధారణంగా యుఎస్ లో హాలీవుడ్ చిత్రాల టికెట్ ధర 5 డాలర్లు మాత్రమే. ఈ నేపథ్యంలో టికెట్స్ కి ఆఫర్స్ ఇచ్చే సంస్థ రద్దుకావడం సైరా ప్రీమియర్ వసూళ్లపై ప్రభావం పడుతుందని అంటున్నారు. 

ఏది ఏమైనా సైరా చిత్రం యుఎస్ ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.