ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొదటిసారి ఒక తెలుగు హిస్టారికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అదే సైరా. ఉయ్యాలవడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించడంతో బాలీవుడ్ - కోలీవుడ్ లో కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. ఇకపోతే మొదట భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు బజ్ తేవాలని ప్లాన్ వేశారు. 

కానీ ఈవెంట్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ నెల 18న వేడుకను ఘనంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని అనుకోని కారణాల వల్ల డేట్ ని మార్చినట్లు సమాచారం. ఈ విషయంపై కూడా సైరా టీమ్ నుంచి త్వరలో క్లారిటీ రానుంది. కొత్తగా సెప్టెంబర్ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకున్నట్లు టాక్. 

ఇక వేడుకకు మెగా హీరోలందరూ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ పలు రాజకీయ నాయకులూ కూడా వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇక సినిమా అక్టోబర్ 2న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించారు.