మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ మరికొద్ది నిమిషాల్లో విడుదల కానుండగా అప్పుడే లీకులు మొదలయ్యాయి. సైరా ట్రైలర్ ఇదే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో నటించిన సైరా చిత్రాన్ని రాంచరణ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాడు. 

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని కళ్ళకు కట్టేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అభిమానులు ఎంతో ఉత్కంఠగా సైరా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సైరా ట్రైలర్ ఇదే అంటూ ఓ వీడియో వైరల్ కావడం మెగా అభిమానులని అసహనానికి గురిచేస్తోంది. 

ఆ వీడియో పోస్ట్ చేస్తున్న వారిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా లీకులు చేసి సినిమాపై ఉన్న ఆసక్తిని తగ్గించే ప్రయత్నం చేయొద్దంటున్నారు. మరికొందరైతే దారుణంగా విరుచుకుపడుతున్నారు. 

ట్రైలర్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇలా లీకులకు పాల్పడడం సిగ్గులేని చర్య అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 22 వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఓ ట్విట్టర్ అకౌంట్ లో ట్రైలర్ లీక్ అయింది.