టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా చిరు కానుక వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక జరుపుకునే ఒక రోజు ముందుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియో చూస్తుంటే చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడిందో అర్ధమవుతోంది. 

మునుపెన్నడూ చూడని అద్భుత యాక్షన్ సీన్స్ స్క్రీన్స్ ని బ్లాస్ట్ చేస్తాయని చెప్పవచ్చు. రోమాలు నిక్కబొడిచేలా ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సినిమాలో నటిస్తున్న అందరిని చూపించారు. అమితాబ్ బచ్చన్ నుంచి నిహారిక వరకు ప్రధాన పాత్రలన్నిటిని సురేందర్ రెడ్డి మేకింగ్ వీడియో లో చూపించాడు. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ వచ్చి అమితాబ్ ని కలిసిన క్లిప్ కూడా చూపించారు. 

మేకింగ్ వీడియోనే ఇలా ఉందంటే సినిమా ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో సినిమా టీజర్ ని ఈ 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక సినిమాను అక్టోబర్ రెండున రిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.