దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా సైరా రిలీజ్ సంబరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం రిలీజవుతుంటే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో, యూఎస్, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి హంగామానే కనిపిస్తోంది. 

థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ లోని  సుదర్శన్ థియేటర్ వద్ద బెంగుళూరు నుంచి వచ్చిన మార్టిన్ అండ్ టీం కర్ణాటక స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి కటౌట్ కు పూలమాల అలంకరణ చేసారు. ఈ డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది. 

దుబాయ్, యూఎస్, తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని గంటల్లో సైరా షోలు ప్రారంభం కానున్నాయి.