కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 చివరి అంకానికి చేరుకుంది. ఫైనలిస్టులు ఎవరో నేడు ఆదివారం తేలిపోతుంది. ఫైనల్ చేరేందుకు ఇంట్లో ఉన్న 7గురు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 చివరి అంకానికి చేరుకుంది. ఫైనలిస్టులు ఎవరో నేడు ఆదివారం తేలిపోతుంది. ఫైనల్ చేరేందుకు ఇంట్లో ఉన్న 7గురు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మాటల యుద్ధంలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో గత వారం శివాజీ, శోభా శెట్టి మధ్య జరిగిన గొడవ.. ప్రశాంత్, అమర్ దీప్ మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అమర్ దీప్ పూర్తిగా కంట్రోల్ కోల్పోయి పిచ్చిపట్టినట్లు అరవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సోషల్ మీడియాలో అమర్ దీప్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ విషయంలో నాగార్జున అమర్ దీప్ కి బాగానే క్లాస్ పీకారు. ఆటలో ఏమవుతుందో.. ఎందుకు కంట్రోల్ కోల్పోతున్నానో అర్థం కావడం లేదు అంటూ అమర్ దీప్ సంజాయిషీ ఇచ్చాడు. 

అమర్ దీప్ వాడిన పదజాలం కూడా చర్చనీయాశం గా మారింది. అయితే అమర్ దీప్ కి సోషల్ మీడియాలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుంచి మంచి మద్దతే లభిస్తోంది. సోషల్ మీడియాలో ఒకవైపు అమర్ దీప్ పై ట్రోలింగ్ జరుగుతుంటే మరోవైపు అతడికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. అరియనా కొన్ని రోజుల క్రితం అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేసింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహైల్ మద్దతు తెలిపాడు. 

View post on Instagram

సోహైల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అమర్ దీప్ నాకు పర్సనల్ గా తెలుసు. చాలా మంచి పర్సన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెబుతున్నా. బిగ్ బాస్ షో అనేది రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాదు. మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది మనచేతుల్లో ఉండదు. 

ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. కొంతమందికి కోపం వస్తుంది. కొంతమందికి బాగా ఓపిక ఉంటుంది. కానీ అమర్ దీప్ ఫేక్ మాత్రం కాదు. తనకు అనిపించినట్లు జెన్యూన్ గా ఉంటున్నాడు అంటూ సోహైల్ మద్దతు తెలిపాడు.