ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా షూటింగ్ దాదాపు .ఎండింగ్ కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ ఆలస్యమవ్వడం చూస్తుంటే జనవరికి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. 

ఆ సంగతి అటుంచితే సినిమాపై ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా చిత్ర యూనిట్ నుంచి సరైన క్లారిటీ అయితే రావడం లేదు. సినిమాలో అనుష్క ఒక స్పెషల్ రోల్ లో మెరవనుంది. ఈ విషయం జనాల్లో బలంగా పాతుకుపోయింది. మొదట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆమెతోనే మొదలవుతుందని టక్ వచ్చింది.  అయితే అనుష్క రీసెంట్ గా తన సీన్స్ కి సంబందించిన షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. 

షూటింగ్ మూగిన అనంతరం కూడా అనుష్క విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక అనుష్క కూడా తన సైలెన్స్ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి తన సినిమాలపై మౌనం పాటిస్తోంది. అన్ని పాత్రల గురించి స్పెషల్ పోస్టర్స్ తో క్లారిటీ ఇచ్చిన సైరా గ్యాంగ్ అనుష్క పాత్రపై ఎందుకు సైలెంట్ గా ఉందొ అర్ధం కావడం లేదు. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో అయినా ఈ విషయాన్నీ చెబుతారో లేదో చూడాలి.