భారత మాత సంకెళ్ల తెంచేందుకు పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరంజీవి టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి .... సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు (బుధవారం) భారీగా  విడుదల కానున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు సుదీప్‌ అవుకు రాజు అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రమోషన్స్ లో బాగంగా తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా సుదీప్ ..సైరా సెట్ లో స్పెషల్ దోశ వేస్తున్న  వీడియోని షేర్ చేసారు.

సైరా నరసింహా రెడ్డి సెట్ లో స్పెషల్ ఆమ్లెట్ దోశ...ఫన్ టైమ్ అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన వారంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా షూట్ చేసారో అని చెప్పుకుంటున్నారు.  ఇక ఈ చిత్రం షూటింగ్ విషయాలను చెప్తూ సుదీప్ ..రామ్ చరణ్ ని ఎత్తేసారు. తన ఎంటైర్ కెరీర్ లో బెస్ట్ ప్రొడ్యూసర్ అని అన్నారు.

రామ్ చరణ్ కేవలం మంచి నటుడు అని అందరికీ తెలుసు. యాక్టింగ్ స్కిల్స్ ప్రక్కన పెడితే...ఆయన మెగా బడ్జెట్ సినిమాలను డీల్ చేసే స్పెషల్ ఎబిలిటీ ఉంది. కేవలం నిర్మించటం అంటే డబ్బులు పెట్టి ఊరుకోవటం కాదు..ఆర్టిస్ట్ లను జాగ్రత్తగా చూసుకోవటంలోనూ ఆయన కేర్ తీసుకుంటారు అని అన్నారు.

అలాగే `లెజెండ్‌, జెంటిల్మెన్ చిరంజీవిగారి ఆతిథ్యం, అభిమానం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులో భాగం కావ‌డం ద్వారా చిరంజీవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నా. సురేంద‌ర్ రెడ్డి, అత‌ని టీమ్‌కు ధన్య‌వాదాలు. ఈ ప్రాజెక్టుకు మూల‌స్తంభంగా నిలిచిన రామ్‌చ‌ర‌ణ్‌కి ధ‌న్య‌వాదాలు` అని సుదీప్ కామెంట్ చేశాడు.

సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Fun Times on th set of #SNR.. Special Omlette Dosa.

A post shared by kicchasudeep (@kichchasudeepa) on Sep 30, 2019 at 8:08am PDT