టాలీవుడ్ లో ఎప్పుడు లేని విధంగా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వచ్చే ఏడాది రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా.. రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా 2019లో రిలీజ్ కానున్నాయి. 

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో మొదటి సారి మెగాస్టార్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా  కనిపించనుండడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అయితే సినిమాను కూడా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 మూమెంట్ లోనే రిలీజ్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ సన్నాహకాలు చేస్తున్నాడు. ఇక మరోవైపు యాక్షన్ కథతో రానున్న ప్రభాస్ కూడా అదే సమయంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రెండు సినిమాలు కూడా దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. అయితే యూవీ క్రియేషన్స్ మెగాస్టార్ మీద రెస్పెక్ట్ తో విడుదల తేదీని వాయిదా వేసుకోవచ్చనే టాక్ కూడా వస్తోంది. రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కుతున్నాయి కాబట్టి ఒక నెల గ్యాప్ తీసుకొని రిలీజైతే వేటికవే మంచి కలెక్షన్స్ రాబడతాయని చెప్పవచ్చు. అయితే సినిమాలు విడుదల తేదీల్లో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.