మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'సై రా'. రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతున్నా ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. అప్పుడెప్పుడో చిరంజీవి పుట్టినరోజు కానుకగా చిన్న టీజర్ వదిలారు. టీజర్ వచ్చి పది నెలలు దాటిపోయింది. అప్పటినుండి సినిమాపై మరో అప్డేట్ లేదు.

నిర్మాత రామ్ చరణ్ ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ సినిమా అనుకున్న సమయానికి థియేటర్ లోకి వచ్చేలా కనిపించడం లేదు. ముందుగా ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ తాజా సమాచారం ప్రకారం 'సై రా' అక్టోబర్ లో కూడా రిలీజ్ కావడం కష్టమని టాక్.

గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న సమయానికి సినిమా పనులు పూర్తవుతాయో లేదో అనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. సినిమా ప్రచార కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయం వెచ్చించేలా.. ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎలాంటి హాదావిడి లేకుండా తీరికగా వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.