వరుణ గండం.. సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద మెగాస్టార్ భారీ కటౌట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేడు హైదరాబాద్ లో సైరా ప్రీరిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహిస్తున్నారు.

మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం అయింది. మరికొద్ది సమయంలో ప్రీరిలీజ్ వేడుక ప్రారంభం కానుంది. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వరుణుడి ముప్పు పొంచి ఉంది.సైరా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరవుతుండడం విశేషం.
చాలా రోజులు తర్వాత మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించబోతుండడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. కానీ వరుణుడు ఎమ్ చేస్తాడో మరి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
ఇదిలా ఉండగా సైరా ప్రీరిలీజ్ వేడుక కోసం శ్రేయాస్ మీడియా సంస్థ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ లాంటి ప్రముఖులు ప్రీరిలీజ్ వేడుకకు అతిథులుగా హాజరు కాబోతున్నారు.