మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ యూనిట్ ఇటీవల మేకింగ్ వీడియో, సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా వినాయకచవితి సందర్భంగా చిత్రనిర్మాత రామ్ చరణ్ సినిమా పోస్టర్ ని విడుదల చేశారు.

ఇందులో చిరంజీవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది.

అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.