మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీతో హ్యూజ్ హిట్ కొట్టి తన సత్తా చాటాడు. ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో... 151వ సినిమాగా సెట్స్‌పైకి వెళ్లనున్న సైరా నరసింహా రెడ్డి ని అత్యంత ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నారు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించినదిగా చెబుతున్న ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, కంచె లాంటి చిత్రాలకి అదుర్స్ అనిపించే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ మళ్లీ చిరు 151వ సినిమాకు కూడా డైలాగ్స్ రాస్తున్నారు.సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ బ్రిటీష్ అధికారిని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎదిరించే క్రమంలో ఓ సన్నివేశం కోసం సాయిమాధవ్ రాసిన డైలాగ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ డైలాగ్ వైరల్ అవుతోంది. "ఒరేయ్.. నేను ఒట్టి చేతులతో వచ్చా... నువ్వు భుజంమీద తుపాకీతో వచ్చావు. అయినా నా చేయి మీసం మీదకు వెళ్లేసరికి నీ బట్టలు తడిచిపోతున్నాయ్ రా" అనే డైలాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సైరా సినిమాకు మంచి ప్రమోషన్ కల్పిస్తోంది. ఇలాంటి డైలాగ్స్ తో మెగాస్టార్ చిరంజీవి దుమ్ములేపుతారని టాక్ వినిపిస్తోంది.


 

ఈ డైలాగ్ లీకై చాలా రోజులే అయినప్పటికీ, మరోసారి ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తోందీ డైలాగ్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరుతోపాటు అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 6 నుంచి సైరా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.