సైరా నరసింహారెడ్డి హంగామా చూస్తుంటే సినిమా ఫ్యాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఫిల్మ్ పై భారీ స్థాయిలో అంచనాలను నెలకొన్నాయి. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మెగాస్టార్ అభిమానులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

అయితే మెగా ఫ్యాన్స్ జోష్ ఏ స్థాయిలో ఉందొ ఈ స్పెషల్ పిక్ చుస్తే ఈజీగా అర్ధమవుతుంది. అమెరికాలో ఒక పార్కింగ్ ప్లేస్ లో కార్లతో సైరా టైటిల్ ని సెటప్ చేశారు. మెగాస్టార్ సైరా టీషర్ట్స్ కూడా యూఎస్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ డిఫరెంట్ టైటిల్ ఫోటో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 270కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించడంతో వరల్డ్ వైడ్ గా సినిమాకు మరింత క్రేజ్ దక్కుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ అలాగే సైరా వీడియో సాంగ్ ట్రేండింగ్ లిస్ట్ లో చేరాయి. మరి ఈ దెబ్బతో సైరా మొదటిరోజు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.