ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా బిజినెస్ పనుల్లో ప్రస్తుతం రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దాదాపు 270కోట్ల వరకు సినిమా కోసం ఖర్చయినట్లు సమాచారం. 

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబందించిన బిజినెస్ సాలిడ్ గా  నడుస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్ గా నైజం ఏరియాలో సినిమా హక్కులను పొందేందుకు ఒక బిజినెస్ మెన్ 35కోట్ల వరకు అఫర్ చేస్తున్నట్లు టాక్. ఇంకా ఈ డీల్ క్లోజ్ కాలేదు. సినిమా బిజినెస్0 40కోట్లవరకు చేరుకునే అవకాశం ఉందని కొణిదెల ప్రొడక్షన్స్ ఇంకా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేదట. త్వరలోనే ఈ డీల్ ఊహించని రేట్ కు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 

ఆదివారం హైదరాబాద్ లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబందించిన పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. మెగా హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్స్ అలాగే  చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.