మెగాస్టార్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.. కొన్ని సాంగ్స్ అండ్ ప్యాచప్ సీన్స్ పూర్తి చేస్తే షూటింగ్ వర్క్ మొత్తం పూర్తయినట్టే. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చెయ్యాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నాడు. 

అసలు విషయంలోకి వస్తే.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి - నయనతార ల మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్ సినిమాలో హైలెట్ అని తెలుస్తోంది. హైదరాబ్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో పాటను  షూట్ చేస్తున్నారు.సాంగ్ లో రొమాంటిక్ డోస్ ఎక్కువ కాకూండా అందంగా తీర్చిదిద్దుతున్నట్లు టాక్. 

ఇక పాటను షూట్ చేసిన తరువాత హీరోయిన్ అనుష్కకు సంబందించిన సీన్స్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ముగించే ప్లాన్ లో ఉన్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.