చింతల్ లోని  వాజ్ పెయ్ నగర్లో  సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురికి తీవ్ర  గాయాలయ్యాయి.  సైరా రిలీజ్ అవుతున్న సందర్బంగా స్థానిక యువకులు గత కొన్ని రోజులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే అనుకోకుండా ముగ్గురు మెగా అభిమానులు వేడుకల్లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా స్థానిక యువకులైన ప్రశాంత్  (23) రమేష్ (27),చిరంజీవి ( 30) ఈ రోజు సాయంత్రం వాజ్ పాయ్ నగర్ లోని ఓ భవనానికి సైరా బ్యానర్ ని కట్టడానికి సిద్ధమయ్యారు. ఇదివరకే ఉన్న ఉన్న సాహో బ్యానర్ తీసేశారు. అనంతరం సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ ఘాతంతో క్రింద పడ్డారు. 

ముగ్గురు యువకులు ఘటనలో గాయపడడంతో స్థానికులు.బాలానగర్ బి.బి.ఆర్.ఆసుపత్రి కి తరలించారు. ఈ విషయంపై  పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సైరా వరల్డ్ వైడ్ గా బుధవారం తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.