మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి  బయోపిక్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రణాళిక సిద్ధమైంది. గత నెల జార్జియా లో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన సైరా యూనిట్ రీసెంట్ గా హైదరాబద్ లో కూడా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసింది'. 

ఇక మరో షెడ్యూల్ కోసం చారిత్రాత్మక ప్యాలెస్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ ఎండింగ్ వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి నెక్స్ట్ షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశాడట. ప్రతిష్టాత్మకం మైసూర్ ప్యాలెస్ లో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఇతర రాజ్యాల రాజులకు సంబందించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయనున్నారు. 

ఈ ఎపిసోడ్ లో మెగాస్టార్ అద్భుతంగా కనిపిస్తారని టాక్. ఇక మైసూర్ షెడ్యూల్ అనంతరం మరికొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం హైదరాబాద్ రానున్నారు. స్పెషల్ సెట్స్ లలో సీన్స్ ను షూట్ చేయనున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో గాని లేదా ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.