కాలం పరిగెడుతున్న కొద్దీ అన్ని సినిమా ఇండస్ట్రీలలో మార్పులు వస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో కాకపోయినా కొన్ని విషయాల్లో ఇండియన్ సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాల స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్ కు సంబందించిన ఎపిసోడ్స్ విదేశీ ఆడియెన్స్ ను కూడా అలరిస్తున్నాయి. 

ఇప్పుడు సైరా నరసింహ రెడ్డి బయోపిక్ పై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. 

సినిమా వచ్చే వరకు రోజుకో వార్త అభిమానులను థ్రిల్ కి గురి చేస్తున్నాయి. సినిమా ఉహలకందని స్థాయిలో ఉంటుందని ఒక ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా సైరా చిత్ర యూనిట్ జార్జియాలో 5వారాలకు పైగా వార్ సీన్స్ ను చిత్రీకరించింది. అదే క్లైమాక్స్ ఎపిసోడ్. మెగాస్టార్ చాలా వరకు డూబ్ లేకుండా నటించి చిత్ర యూనిట్ లో ఒక ఉత్తేజాన్ని నింపారు. 

ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిను బంధించడానికి బ్రిటిష్ సైన్యం యుద్ధం చేయడం దాన్ని నరసింహారెడ్డి సైన్యం ఎదుర్కోవడం సినిమాలో ప్రధానమైన ఘట్టం. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో సీన్స్ ను చిత్రీకరించారు. ఐదుగురు హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్లతో పాటు టాప్ క్లాస్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు - సురేందర్ రెడ్డి అండ్ టీమ్ కష్టపడిన విధానం వర్ణనాతీతమని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. 

సినిమాకోసం రత్నవేలు భారీ కెమెరా ఎక్విప్ మెంట్ - స్పెషల్ క్రేన్లను తయారుచేయించాడు. యుద్ధ సన్నివేశాలు కళ్లకుకట్టినట్లుగా ఒక యాక్షన్ ఫీల్ ను రప్పించే విధంగా షూట్ చేశారట. క్లైమాక్స్ లో థియేటర్ దద్దరిల్లడం కాయమని తెలుస్తోంది. ఇక వీరుపడిన కష్టానికి తగిన ఫలితం రావాలంటే అంతా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ చేతిలో ఉందని చెప్పాలి. 

గ్రాఫిక్స్ వర్కౌట్ అయితే సైరాని అడ్డుకోవడం ఎవరితరం కాదు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ సినిమాను 200కోట్లతో సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి మరియు జగపతి బాబు వంటి వారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.