టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రాల్లో సైరా ఒకటి. మెగాస్టార్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా 200కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన బిజినెస్ ను నిర్మాత ఇప్పుడిపుడే క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మిగతా ఏరియాల రేట్లు ఎలా ఉన్నా ఎపిలో మాత్రం సైరా రేటు రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా చిరంజీవి సినిమా ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. దాదాపు 90శాతం థియేటర్స్ లో సినిమాను ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారట. అయితే ప్రభాస్ హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ ఏపి రైట్స్ ను సాలిడ్ రేట్ కు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

దాదాపు సినిమా ప్రీ రిలీజ్ ద్వారా నిర్మాత బడ్జెట్ ను రికవర్ చేసినట్లు టాక్. అయితే ఏ రేటుకు అమ్ముడుపోయింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా - అమితాబ్ బచ్చన్ - సుదీప్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.