మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. నిర్మతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. తన తండ్రి కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా తీయాలనే ఉద్దేశంతో ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా జార్జియాలో షెడ్యుల్ మొదలుపెట్టింది.

ఈ షెడ్యుల్ కోసం చరణ్ భారీగా ఖర్చు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఎంతసమయం ఉండబోతుందనే విషయంపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిది నిమిషాల యుద్ధ సన్నివేశాల కోసం చిత్రబృందం ఏకంగా రూ.54 కోట్లు ఖర్చు చేస్తోందట..

 దాదాపు 150 టీమ్ సభ్యులు జార్జియాకి చేరుకున్నాడు. కొన్ని వందల కాస్త్యుమ్స్ ని కూడా వెంట తీసుకెళ్లారు. లోకల్ గా 600 మంది ఆర్టిస్టులను షూటింగ్ కోసం తీసుకున్నారు. ఈ షెడ్యుల్ ఐదు వారాల పాటు జరగనుంది. ఇంత చేస్తున్నా.. సినిమాలో ఈ ఎపిసోడ్ కేవలం ఎనిమిది నిమిషాల పాటే కనిపించనుందట. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.