ట్రోలింగ్ పై ఫస్ట్ టైమ్ స్పందించిన సుశ్మితా సేన్? ‘గోల్డ్ డిగ్గర్’ కామెంట్స్ పై ఘాటు రిప్లై
మాజీ విశ్వసుందరి, నటి సుశ్మితా సేన్ కొద్దిరోజులుగా ట్రోల్స్ కు గురవుతోంది. తన రిలేషన్ షిప్ పై కొందరు ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ ట్రోల్స్ చేశారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. మొదటిసారిగా గట్టి సమాధానం చెప్పింది.
మాజీ విశ్వసుందరిగా రాణించిన సుస్మితా సేన్ (Sushmita Sen) బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా రాణించింది. 20కి ముందు బాలీవుడ్‌ని ఓఊపు ఊపేసింది. తన నటన, గ్లామర్ పరంగానూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అదే సమయంలో ఆమె రిలేషన్షిప్స్ లోనూ దూకుడుగానే వ్యవహరించింది. పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్, తనకంటే చిన్నవాడైన రోహ్ మన్, మరికొందరితో డేటింగ్ చేసినట్టు బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
ఇక రీసెంట్ గా వ్యాపారవేత్త లలిత్ మోడీ (Lalith Modi)తో డేటింగ్ ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో మూడు నెలలకే సుస్మితా సేన్ లలిత్ మోడీకి బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. పెళ్లి దాకా వెళ్లిన వీరి ప్రేమ ఎందుకు విఫలమైందో తెలియదు. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు. అయితే సుష్మితా సేన్, లలిత్ మోడీ రిలేషన్ షిప్ ప్రకటించిన కొత్తలో సుష్మితాపై కొందరు ట్రోలింగ్ చేశారు. ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ ఆమె విమర్శించారు. వీటిపై తాజాగా సుశ్మితా సేన్ స్పందించారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘తాళి’ (Taali) ప్రమోషన్స్ లో దీనిపై మాట్లాడింది.
‘తాళి’ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలపైనా మాట్లాడింది. సుశ్మితా సేన్ మాట్లాడుతూ.. ఇది నా జీవితం.. నా గురించి బయట వ్యక్తులకు అనవసరమని భావిస్తున్నాను. ‘గోల్డ్ డిగ్గర్’ అంటే అర్థం తెలుసుకోగలను. ఇలా విమర్శలు వస్తే చాలా బాధగా ఉంటుందన్నారు. కానీ అలాంటివి తాను పట్టించుకోనని చెప్పారు. ప్రస్తుతం తను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనంటూ... సింగిల్ గానే ఉన్నానని స్పష్టం చేశారు.
ఇక తను నటించిన ‘తాళి’ ఫస్ట్ లుక్ పైనా స్పందించింది. ‘సోషల్ యాక్టివిస్ట్, ట్రాన్స్ జెండర్ శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా తాళి సినిమా తెరకెక్కుతోందన్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పైనా పలువురు నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేశారు. అసలు ఇలా కూడా కామెంట్స్ చేయగలరా అని ఆశ్చర్యపోయాను. ఏదేమైనా అందరికీ బదులివ్వాల్సిన అవసరం లేదు..‘ అంటూ చెప్పుకొచ్చింది.