ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుష్మితా సేన్ చాలా రోజులుగా ఓ యువ మోడల్ తో డేటింగ్ చేస్తోంది. ముంబైకి చెందిన రోహ్మాన్ షాల్ అనే మోడల్.. సుష్మితా ప్రేమలో ఉన్నాడు. ఈ విషయాన్ని ఫోటోల ద్వారా సుష్మితా ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. 

తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. అందులో సుష్మిత, రోహ్మాన్ లు ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న ఫోటో హైలైట్ కాగా.. మరోఫోటో వైరల్ గా మారింది.  అందులో సుష్మితా చేతికి ఉన్న ఉంగరం హైలైట్ అయ్యేలా ఫోటో తీశారు.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు సుష్మితా, రోహ్మాన్ లకు ఎంగేజ్మెంట్ అయిందంటూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఇద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. రోహ్మాన్.. సుష్మితా కంటే వయసులో చాలా చిన్నవాడు. కానీ వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

ఈ ఏడాదిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎంగేజ్మెంట్ గురించి కానీ పెళ్లి గురించి కానీ సుష్మితా ఎలాంటి ప్రకటన చేయలేదు.