విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 12,13,14 తేదీలలో అంకిత, విక్కీ జైన్ వివాహం జరగనుంది. బంధువులు, సన్నిహితులతో ఈ శుభవార్త పంచుకున్న జంట, పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారని వినికిడి.

లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే పెళ్లికి సిద్దమయ్యారట. ఆమె తన బాయ్ ఫ్రెండ్ Vicky jain తో ఏడు అడుగులు నడవనున్నారట. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వార్త కోడై కూస్తుంది. తాజాగా అంకిత ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దివాళి వేడుకలలో భాగం డాన్స్ చేస్తున్న విక్కీ జైన్, Ankita lokhande డాన్స్ చేస్తూ కిస్ చేసుకున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కాగా, ఫ్యాన్స్ కామెంట్స్ తో రచ్చ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 12,13,14 తేదీలలో అంకిత, విక్కీ జైన్ వివాహం జరగనుంది. బంధువులు, సన్నిహితులతో ఈ శుభవార్త పంచుకున్న జంట, పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారని వినికిడి. బిజినెస్ మాన్ విక్కీ జైన్ తో అంకిత లోఖండే కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడూ తమ రిలేషన్ కి సంబంధించిన రొమాంటిక్ పిక్స్ అంకిత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల దుబాయ్ ట్రిప్ కి వెళ్లిన ఈ జంట, ఇండియా-పాకిస్తాన్ టి20 మ్యాచ్ స్వయంగా వీక్షించారు. 

Also read హృదయం బద్దలయ్యేలా చేసిన బ్రేకప్.. ఇక పెళ్ళికి రెడీ అంటున్న ఇలియానా, చిన్న పిల్లలా ఏడుస్తూ..
కాగా గత ఏడాది ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్న యంగ్ హీరో Sushanth singh rajput తో అంకిత లోఖండే ఆరేళ్ళు డేటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి పవిత్ర రిస్తా అనే సీరియల్ లో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ సీరియల్ సీక్వెల్ ప్రారంభం కాగా, అంకిత లోఖండే నటిస్తున్నారు. ఈ సందర్భంగా సుశాంత్ ని గుర్తు చేసుకున్న అంకిత.. ఆయనను చాల మిస్ అవుతున్నట్లు వెల్లడించారు.

Also read కోటు బటన్స్ తీసేసి లో దుస్తులు చూపిస్తూ బీస్ట్ బ్యూటీ పూజా హెగ్డే రచ్చ... షేక్ చేస్తున్న లేటెస్ట్ ఫోటో షూట్
మరో వైపు విక్కీ కౌశల్-కత్రినా సైతం పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు కూడా డిసెంబర్ లో భార్యాభర్తలు కానున్నారట. మొత్తంగా డిసెంబర్ నెలలో బాలీవుడ్ సెలెబ్స్ సింగిల్ స్టేటస్ కి బై బై చెప్పి, జంటలుగా మారనున్నారు. 

View post on Instagram