బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా సంచలన ప్రకటన చేసింది సంజన సంఘీ. తాను తన స్వస్థలం ఢిల్లీకి వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించింది సంజన. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి సెల్ఫీని పోస్ట్ చేసిన సంజన, భావోద్వేగంగా ముంబైకి వీడ్కోలు పలికింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణవార్త నుంచి ఆయన సన్నిహితులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. తాజాగా సుశాంత్ ఆఖరి సినిమా దిల్‌ బెచారా హీరోయిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా సంచలన ప్రకటన చేసింది సంజన సంఘీ. తాను తన స్వస్థలం ఢిల్లీకి వెళ్లిపోతున్నట్టుగా ప్రకటించింది సంజన. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి సెల్ఫీని పోస్ట్ చేసిన సంజన, భావోద్వేగంగా ముంబైకి వీడ్కోలు పలికింది.

అంతేకాదు తాను ఇక ముంబైకి తిరిగి రానని హింట్‌ ఇచ్చింది సంజన. `నేను తిరిగి ఢిల్లీ వెళుతున్నా. నగర వీదులు కొత్తగా, ఖాళీగా కనిపిస్తున్నాయి. నా హృదయంలోని విషాదం నా దృష్టి కోణాన్ని మార్చింది` అంటూ పోస్ట్ చేసింది. సంజన సింగ్ 2011లో రిలీజ్‌ అయిన రాక్‌స్టార్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమాతో పలు ప్రచార చిత్రాల్లోనూ నటించింది సంజన.

View post on Instagram

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా దిల్‌ బెచారాలోనూ సంజన సంఘీ హీరోయిన్‌గా నటించింది. యువ నటుడి మరణంతో షాక్‌కు గురైన సంజన సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది.